ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిధుల విషయం పై ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాని విషయమై ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపించిందని, ఈ రోజు శాసనసభ సమావేశాల్లో చంద్రబాబునాయుడు గారు ప్రస్తావించారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం, ఇతర పనులను నిలిపివేతపై చర్చకు పట్టుబట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.


వివిధ ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం పై చర్చకు పట్టుబడతామని అన్నారు. పార్టీ వ్యూహ కమిటీతో ఆయన టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. వైఎస్సార్ పార్టీ దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయనీ, యువత ఉపాధి అవకాశాలు కోల్పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పోలవరం, అమరావతి పనులు ముందుకు సాగట్లేదని, పనులను ముందుకు నడిపించే సామర్థ్యం వైఎస్సార్ పార్టీకి లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ పాలన వల్ల సొంత రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఆయన పాలన వల్ల పక్క రాష్ర్టాలకే లాభం చేకూరుతుందని వైఎస్సార్ పార్టీ పై మండిపడ్డారు.రాజధాని నగరం అమరావతిలో పనులు నిలిపివేతపై శాసనసభల్లో నేడు వాయిదాకి తీర్మానం ఇచ్చామని తెలిపారు.


ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేకపోగా ప్రతిపక్షం పార్టి చెప్తుంటే కూడా వినటం లేదని మండిపడ్డారు. వైకాపా పార్టీ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. పులివేందులలో జరుగుతున్న ఆరాచకాలు రాష్ట్రం మొత్తం పెట్రేగాయనీ, దౌర్జన్యాలతో శాంత్రి భద్రతలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.


ఈ విధంగా పెట్టుబడులు రాకపోతే యువతకి ఉపాధి అవకాశాలే రాక పోగా, రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన ఈ సందర్బంగా చెప్పారు. ఇది ఒక రోజు పొరాటం కాదని, ప్రతిరోజు ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: