ఒక మనిషికి రోగాలు రావడం సహజం.  వచ్చిన రోగాలను నయం చేసుకోవడం చాలా కష్టం.  అందుకే రోగాలు తగ్గించుకోవడనికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. లక్షల కొద్ది డబ్బును ఖర్చు చేస్తుంటారు. జబ్బులు మాత్రం నయం కావు.  కొంతమంది ప్రకృతి వైద్యాన్ని నమ్ముకుంటే.. మరికొందరు ఆయుర్వేదంను నమ్ముకుంటారు. 


ఇప్పుడు మరోకొత్త వైద్యం వెలుగులోకి వచ్చింది.  అదే శాండ్ థెరపీ.  పూర్వకాలంలో కొన్ని రకాల జబ్బులకు మట్టివైద్యం చేసేవారు.   నేలను తవ్వి అందులో పీకలలోతులో మనిషిని కూర్చోపెట్టేవారు.  ఓ అరగంట గంట తరువాత తిరిగి బటయకు తీసేవారు.  ఇలా చేయడం వలన వెన్నుపూస నిటారుగా మారుతుంది.  


వంగిపోయి ఉన్నట్టుగా ఉన్నా.. దీనివలన నయం అవుతుంది.  పైగా మట్టినేల కాబట్టి శరీరానికి తగిన మూలకాలు అందుతాయి.  ఇలానే ఇప్పుడు శాండ్ థెరపీ ఒకటి అందుబాటులోకి వచ్చింది.  ఈ థెరపీ ద్వారా శరీరంలోని చాలా రోగాలు మాయం అవుతాయని నమ్మకం ఉంది.  


ఈ నమ్మకంతో చైనాలోని గౌచాంగ్‌ జిల్లా యాయెర్‌ పట్టణానికి సమీపంలో వున్న షాంఘు అనే గ్రామంలో ఈ థెరపీ నిర్వహిస్తుంటారు.  ఏ శాండ్ వైద్యం కోసం ప్రతి ఏడాది దాదాపుగా మూడు లక్షల మంది అక్కడికి వస్తుంటారట.  పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: