తెలంగాణ మున్సిపల్ చట్టం - 2019 బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఇలాంటి బిల్లు కోసమే ప్రజలు ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తూ వస్తుంది..ఈ బిల్లులోని అంశాలు చూసి.. వారెవా.. కేసీఆరా.. మాజాకా అనుకుంటున్నారు జనం..


మరి అంతగా ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయో చూద్దామా..?

చట్టంలో పొందుపరిచిన కొన్ని ముఖ్యాంశాలు

◆తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత.

◆అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం.

◆ప్రజలకు మేలు చేసేలా కొత్త చట్టం రూపకల్పన.

◆75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయి మాత్రమే.

◆75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను రూ. 100



◆కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి.

◆500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి.

◆యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి.

◆ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు.

◆తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా.

◆అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత.


◆పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ.

◆కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు.

◆హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు.

★బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు

★మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్‌పర్సన్‌ల పదవులు తొలగింపు.

★కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం.

★కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర.


మరింత సమాచారం తెలుసుకోండి: