ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రాగానే ముందు పాత సీఎం పాపాల చిట్టా బయటపెట్టించేందుకు ఉత్సాహపడుతున్నారు. ఓవైపు పోలవరం అవినీతి.. మరోవైపు పవర్ ప్రాజెక్టుల్లో అవినీతి.. ఇలా అన్నివైపుల నుంచి చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.


మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడంలో ఉంటున్నాడనే విషయాన్ని జగన్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. జగన్ ఇస్తున్న ట్విస్టులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. తాజాగా జగన్ లోకేశ్ అక్రమాలపైనా గట్టి పట్టుదలగానే ఉన్నట్టు తెలుస్తోంది.


ప్రత్యేకించి ఐటీ రంగంలో లోకేశ్ చాలా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇన్నిరోజులు టీడీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.


లోకేశ్ అవినీతిపై విచారణ జరగాలని, రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని ఆయన అంటున్నారు. అంతే కాదు.. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. ఈయన మాటలు చూస్తుంటే త్వరలోనే లోకేశ్ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: