కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నాయి. పూటకో రకంగా ఇక్కడ రాజకీయ చదరంగం మారిపోతోంది. వలసల కారణంగా సీఎం కుమార స్వామి పదవి కోల్పోవడం ఖాయం అని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన టీమ్ కొత్త ఎత్తులు వేస్తూ నాటకాన్నిరక్తి కట్టిస్తోంది.


తాజాగా గవర్నర్ ఉత్తర్వులను సైతం లెక్క చేయని విధంగా స్పీకర్ వ్యవహరించడంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అసెంబ్లీలో కర్నాకట ముఖ్యమంత్రి కుమారస్వామి చేతులెత్తేసినట్లు మాట్లాడారు. దీంతో ఆయన రాజీనామా చేస్తారేమో అని అనుకున్నారు.


కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు, గవర్నర్ తనను శాసించలేరని అసెంబ్లీలోనే చెప్పారు. ఆయన బాటలోనే స్పీకర్ కూడా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష పూర్తి చేయాలని గవర్నర్ రెండు సార్లు గడువు విధించినా స్పీకర్ ఏమాత్రం లెక్కచేయలేదు.


విశ్వాస పరీక్షపై చర్చ జరిగిన తర్వాతే బల పరీక్ష జరగాలన్న పట్టుదల స్పీకర్ లో కనిపిస్తోంది. చివరకు సభలో గందరగోళం నెలకొందన్న కారణంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేసేశారు. సో.. ఆదివారం వరకూ కుమార స్వామి పదవికి ఢోకా లేనట్టే..?


మరింత సమాచారం తెలుసుకోండి: