అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం.. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం.. అని చెబుతున్నా.. ఏపీ సీఎం జగన్ మాత్రం వరాల వర్షం ఆపడం లేదు. ఆయన ఇప్పటికే అనేక వర్గాలకు జీతాలు పెంపులు, వేల రూపాయాల లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.


తాజాగా ఆయన మరో మూడు సామాజిక వర్గాలకు తీపి కబురు చెప్పారు. బీసీల్లోనే వెనుకబడిన వర్గాలుగా చెప్పుకుంటున్న రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ కులాలకు జగన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూడు కులాల కుటుంబాలకు జగన్ ఏడాదికి పది వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.


వాస్తవానికి ఈ మూడు కులాలు బీసీల్లోనే ఎంబీలుగా పిలవబడుతున్నాయి. అంటే మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ అన్నమాట. అలాంటి కులాల వారికి ఆర్థికంగా అండగా నిలవాలన్న నిర్ణయం మెచ్చుకోదగిందే. కానీ అదే సమయంలో మిగిలిన బీసీ కులాలకు ఈ నిర్ణయం అంతగా రుచించకపోవచ్చు.


బీసీల్లో ఈ మూడు కులాలతో పాటు మరికొన్ని కులాలు కూడా చాలా వెనుకబడి దాదాపు దళితులతో సమానంగా చూడబడుతున్నాయి. కానీ కేవలం మూడు కులాల వారినే పరిగణనలోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. తమకు కూడా ఆర్థిక సాయం అందించాలని కోరే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: