వైఎస్ జగన్ వరసగా పధకాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఆయన అధికారం చేపట్టి రెండు నెలలు కూడా కాలేదు కానీ అనేక రకాలైన స్కీములు ఇప్పటికే ప్రకటించారు ఇపుడు వాటికి మరికొన్ని జోడించి మిగిలిన వర్గాలను ఆదుకునేందుకు  కార్యచరణ రూపకల్పన చేశారు. 


తాజాగా చిన్న,సూక్ష్మ ,మద్య తరహా పరిశ్రమలకు కొత్త పదకాన్ని తేవాలని ఏపీ  ప్రభుత్వం నిర్ణయించింది.  వైఎస్ ఆర్ నవోదయం పేరుతో ఈ స్కీమును అమలు చేయాలని సంకల్పించారు. ఈమేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను పరిరక్షించేందుకుగాను ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 


జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాలను గుర్తించారు.వీటికి నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలను రీ స్ట్రక్చరింగ్ అవకాశం కల్పిస్తారు. ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా దీని ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం కలగనుంది. 


అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల టైమ్ కూడా ఇస్తారు. మొత్తం మీద చూసుకుంతే ఈ పధకం ద్వారా స్వయం ఉపాధి సాధించి ఎవరి కాళ్ళ మీద వారు నిలబడితే నిజంగా వైఎస్సార్ నవోదయం సాధ్యపడినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: