వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తను పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాల అనే తొమ్మిది హామీలను తెరపై కి లేవనెత్తారు. అందులో ముఖ్యంగా ఒకటి 'వైయస్సార్ రైతు భరోసా'. ఈ భరోసా ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు  ఇస్తాం. పంట వేసే సమయంలో మే నెలలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తాం అని చెప్పారు. ఇదే కాక పంట బీమా గురించి రైతు లు ఆలోచించాల్సిన పనిలేదు రైతన్న చల్లించాల్సిన  బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం అని కూడా చెప్పారు. రైతన్నలకు వడ్డీ లెని పంట రుణాలు కూడా ఇస్తామన్నారు. 


కానీ నేడు జరిగిన సభలో దానిని రూ.6500 ఇస్తున్నట్టు చెప్పారు. దానిపై లొకెష్ ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు. "అసెంబ్లీ సాక్షిగా మరో నవ రత్నం జారిపోయింది. రైతుభరోసా కింద ప్రతి ఏటా రైతులకు రూ.12,500 ఇస్తాం అని ప్రకటించి, ఇప్పుడు తూచ్ మేము ఇచ్చేది రూ. 6,500 మాత్రమే అని మడమ తిప్పి  రైతులను మోసం చేశారు."



అంతేకాక రైతు బరోసా పేరుతో రైతులకు మొత్తం 19,200 కోట్ల భారీ మోసం జరుగుతోంది అని చెప్పారు. ఎలాగంటే వైసీపీ హామీ ఇచ్చింది 12,500 రూపాయలు వైసీపీ ఇస్తున్న కేవలం 6,500 అంటే ఒక రైతు సంవత్సరానికి నష్టపోయేది రూ.6,000 ఐదేళ్లకే నష్టపోయేది రూ.30,000 ఐదెళ్లలో 64 లక్షల మంది నష్టపోతున్నది 19,200 కోట్లు అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: