ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. సంచలన విధానాలు అమలు చేస్తూ జగన్ తన ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకుంటూ పోతున్నారు. అదే సమయంలో పాత విధానాలను, అవినీతి బూజును వదలకొడుతున్నారు. ఏపీలో రివర్స్  టెండరింగ్ వ్యవస్థకు శ్రీకారం చుడతానని కూడా జగన్ ఇంతకు ముందే చెప్పారు. ఇపుడు దానికి పూర్వ  రంగం సిధ్ధమైంది.


ఏపీ ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన  మంత్రివర్గ సమావేశం టెండర్ల పరిశీలనకు ఏర్పాటు చేయతలపెట్టిన జ్యూడిషియల్ కమిషన్ కు ఆమోదం తెలిపింది.టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేయడానికే ఈ బిల్లు తెస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ దీని గురించి చెబుతున్న సంగతి తెలిసిందే. 


ఈ బిల్లు అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్ల సరిశీలన జరగడం కోసం ఈ బిల్లు తెస్తున్నారు. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్‌ కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని.. జడ్జికి సహాయంగా నిపుణులను అందివ్వాలని నిర్ణయించింది. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలనే విధంగా చట్టం చేయనున్నట్లు పేర్కొంది.


మొత్తం మీద చూసుకుంటే తానేమి చెప్పానో అది చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఇకపై టెండర్లలో అవినీతికి, అక్రమాలకు అవకాశం లేకుండా చూసేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: