రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పుడే యువత పక్కదారి పక్కకుండా ఆదాయ వనరుగా మారుతుంది. అందుకు కావాల్సింది కేవలం విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కాదు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు సక్రమంగా నడిస్తే.. వేల ఉద్యోగాలు అందిస్తాయి.


కానీ కొన్నాళ్లుగా ఈ చిన్న, సూక్ష్మ , మధ్య తరహా పరిశ్రమలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. వీటిని ఆదుకోవాలని నిర్ణయించిన జగన్.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ ఆర్ నవోదయం పేరుతో ఈ స్కీమును అమలు చేయనున్నారు. దీనికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.


మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను పరిరక్షించేందుకుగాను ఈ పథకాన్ని అమలు చేస్తారు. జిల్లాల వారీగా గుర్తించిన 86 వేల ఎంఎస్‌ఎంఈలకు రూ. 4000 కోట్ల రూపాయలతో రుణాలను రీ స్ట్రక్చరింగ్ అవకాశం కల్పిస్తారు.


ఇందువల్ల ఆయా పరిశ్రమలు దివాలా తీసే పరిస్థితి నుంచి కోలుకుంటాయి. ఈ కొత్త పథకం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం లభిస్తుంది. తక్షణ పెట్టుబడిసాయం అందే అవకాశం వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: