తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటి శాఖలో జరిగిన అవినీతిపై రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  కలుస్తానని  మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అన్నారు . అంతటితో ఆగకుండా  కేంద్రంతో మాట్లాడి లోకేష్ పై సిబిఐ విచారణ జరిపిస్తానని చెప్పారు .  లోకేష్ అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు .అన్నం సతీష్ ఇటీవల టీడీపీ కి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే . పార్టీ వీడే సమయం లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన సతీష్ మరోమారు లోకేష్ ను టార్గెట్ చేశారు .


 ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం నారా లోకేష్ కారణంగానే  తెలుగుదేశం పార్టీ ఘోరంగా  ఓడిపోయిందన్న ఆయన , టీడీపీ లో ఎందరో నాయకులు లోకేష్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు . లోకేష్ కారణంగా త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ  కాబోతుందని అన్నారు .లోకేష్ కారణంగానే ఎందరో సీనియర్ నాయకులు తెదేపా ను విడి బిజెపి లోకి చేరారన్నారు.  లోకేష్ లాంటి నాయకుడి  నేతృత్వంలో టీడీపీ లో  పని చేయడం ఇష్టం లేకనే, తాను కూడా  ఆ  పార్టీకి రాజీనామా చేశానని సతీష్ తెలిపారు .  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నిట్ట నిల్వన  ముంచింది  లోకేషేనని విరుచుకుపడ్డారు .


తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం వాల్ పోస్టర్లు కూడా అంటించానని .  సొంత నిధులు ఖర్చుపెట్టి పార్టీని నడిపించానని చెప్పారు . కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్ గా పలు  పదవులు నిర్వహించానని,  తండ్రి ని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదంటూ పరోక్షంగా లోకేష్ పై సైటర్లు వేశారు . లోకేష్ పై అన్నం సతీష్ చేస్తున్న విమర్శల వెనుక రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది . సతీష్ కు టీడీపీ లో ఎమ్మెల్సీ పదవి , సుజనా కారణంగానే లభించిందని , అయన బీజేపీ లో చేరగానే సతీష్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు .

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: