బాబు రావాలి.. జాబు రావాలి.. 2014 ఎన్నికల్లో బాగా పాపులర్ అయిన నినాదమిది.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా జాబులు కోకొల్లలుగా ఏమీ వచ్చిపడలేదు. అందుకే 2019లోనూ చంద్రబాబు మరోసారి ఆ నినాదాన్ని నమ్ముకున్నారు. విస్తృతంగా పరిచయం చేశారు.


కానీ పాపం.. జనం మాత్రం ఎన్నిసార్లు నమ్ముతారు.. అందుకే కొత్త ఆశలు రేపుతున్న జగన్ వైపు జనం మొగ్గు చూపారు. అన్ని వర్గాలు ప్రత్యేకించి నిరుద్యోగులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఏపీలో త్వరలోనే బారీగా ప్రభుత్వ ఉద్యోగాల జాతర జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


దాదాపు వివిధ కేటగిరీలకు చెందిన లక్ష ఉద్యోగాల వరకూ నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దాదాపు 6000 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు ప్రకటన రానుంది. సర్వే అసిస్టెంట్లు ఉద్యోగాలు 11వేలు, వీఆర్వోలు- 2000, పశుసంవర్థక శాఖ సహాయకులు 10,000, గ్రామ ఇంజినీర్లు-11,000 , విద్యుత్ లైన్ మెన్ ఉద్యోగాలు 5000 నోటిఫికేషన్ వచ్చే జాబితాలో ఉన్నాయి.


వీటితో పాటు అనేక కేటగిరీల్లో మొత్తం లక్షకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటికి గ్రామ సచివాలయం పోస్టులు అదనం.. మొత్తం మీద ఏపీలో త్వరలోనే కొలువుల జాతర జరగబోతోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: