అధికారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు ఆ అధికారం కళ్లు నెత్తికెక్కకుండా చూసుకోవాలి. లేకపోతే.. జనం ముందు చులకన కావలసి వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరిగింది.


ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మనవడు.. అధికార గర్వంతో ఓ పోలీసు జీపుపై కూర్చుని చేసిన టిక్ టాక్ ఇప్పుడు ఆయన పరువు తీసేసింది. డిజిపి పేరుతో రిజిస్టర్ అయిన ఒక కారు మీద కూర్చుని సినిమా డైలాగులు చెప్పడం వివాదాస్పదమైంది.


ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఏకంగా తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడే డిపార్ట్‌మెంట్‌కు వ్యతిరేకంగా చేసిన టిక్‌టాక్‌ వీడియో కలకలం సృష్టించింది. ఐజీస్థాయి అధికారిని నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పీక కోస్తా అంటూ బెదిరిస్తూ చెప్పే ఓ సినిమా డైలాగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది.


దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గమనించిన ఉప ముఖ్యమంత్రి నష్టనివారణ చర్యలు చేపట్టారు. తన మనవడు ఇలా చేసినందుకు క్షమించాలంటూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. పాపం.. మనవడు చేసిన పనికి పెద్దాయన సారీ చెప్పాల్సి వచ్చిది కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: