అవినీతి - రాజకీయం పడుగు పేకల్లా కలిసిపోయిన రోజులివి.. అవినీతి చేయకుండా రాజకీయాల్లో కొనసాగే అవకాశం కనిపించడం లేదు. అధికారం అందుకోవాలంటే వందల కోట్లలో ఎన్నికల్లో ఖర్చు చేయాలి..అధికారం అందుకున్న తర్వాత ఆ సొమ్ము రాబట్టుకోవాలి.


ఇదో విష వలయంలా తయారైంది. ఇందుకు ఎవరూ మినహాయింగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతిని సహించబోనంటూ ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఏకంగా తన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే జ్యూడిషయల్ కమిషన్ వేసుకునేందుకు సిద్ధమవుతున్న తీరు విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.


ఇందుకోసం జగన్ కేబినెట్.. టెండర్ల పరిశీలనకు ఏర్పాటు చేయతలపెట్టిన జ్యూడిషియల్ కమిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్ల సరిశీలన జరగడం కోసం ఈ బిల్లు తెస్తున్నారు.


దీని ప్రత్యేకత ఏంటంటే.. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్‌ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. వీటి పరిశీలన కోసం జడ్జికి సహాయంగా నిపుణులను ప్రభుత్వం అందిస్తుంది. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలనే నిబంధన కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: