శుక్రవారం అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశంపై సభలో వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఈ ఒప్పందాల్లో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయని సీఎం విమర్శించారు.


అయితే జగన్ మాట్లాడుతున్న సమయంలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సీట్లో లేరు. ఇది గమనించిన జగన్.. చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అందులో పాల్గొటారని ఆశించానని, కాని ఆయన లేరని జగన్ అన్నారు. చంద్రబాబు చర్చలో పాల్గొనకుండా బయట ప్రెస్ ముందు మాత్రం చాలా మాట్లాడతారని విమర్శించారు.


ఈ విషయం జగన్ అలా విమర్శించారో లేదో.. ఆ విషయం చంద్రబాబుకు టీడీపీ నేతల ద్వారా తెలిసినట్టుంది. వెంటనే అసెంబ్లీకి వచ్చేశారు. దీంతో జగన్ కూడా సంతృప్తి చెందారు. అంతే కాదు.. చంద్రబాబు తిరిగి వచ్చినందువల్ల ఆయనకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చేందుకు తాను తాత్కాలికంగా ముగించారు.


చంద్రబాబు మాట్లాడిన తర్వాత తాను మాట్లాడతానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు పిపిఎలపై మాట్లాడారు. ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అయితే.. జగన్ చంద్రబాబు సభలో లేరని చెప్పగానే ఆయన రావడం.. ఆయన రాగానే జగన్ ఆయనకు అవకాశం ఇవ్వడం ఆసక్తికలిగించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: