వైఎస్ కుటుంబానికి , జక్కంపూడి ఫ్యామిలీ కి మంచి అనుబంధం ఉంది . వైఎస్ కేబినెట్ లో జక్కంపూడి రామ్మోహన్ రావు కీలక మంత్రి పదవిని నిర్వహించారు . వైఎస్ మరణాంతరం జగన్మోహన్ రెడ్డి,  కాంగ్రెస్ ను వీడి వైకాపా పార్టీ స్థాపించిన సమయం లో జక్కంపూడి ఫ్యామిలీ కూడా అయన వెంట నడవాలని నిర్ణయించుకుంది . జక్కంపూడి రామ్మోహన్ రావు అనారోగ్యం తో మంచం పట్టడం,  ఆ తరువాత మృతి చెందిన విషయం తెల్సిందే . అయినా జక్కంపూడి ఫ్యామిలీ ని జగన్ రాజకీయంగా ప్రోత్సహిస్తూ వస్తూనే ఉన్నారు .


తొలుత రామ్మోహన్ భార్య విజయలక్ష్మి కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ , ఆమెకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు . ఆతరువాత జక్కంపూడి రాజా కు రాష్ట్ర వైకాపా యువజన విభాగం అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం టికెట్ ఇప్పించి గెలిపించుకు న్నారు.  తాజాగా జక్కంపూడి రాజా కు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి ఆ కుటుంబం పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకున్నారు . రాజకీయంగా తనని నమ్ముకున్న వారిని ప్రోత్సహించడం లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ముందడుగు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే గా గెల్చిన జక్కంపూడి రాజా , ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాణించి ఆ సామాజికవర్గాన్ని వైకాపా వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయితే భవిష్యత్తు లో జగన్ ఆయనకు మరిన్ని అవకాశాలు కల్పించడం ఖాయమని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: