ఎన్నికల మందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీని నిలబెట్టుకోవాలని ఐద్యా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐద్యా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.



మహాత్మా గాంధీ లక్ష్యాలు సాధించే బడ్జెట్ అని ఆర్ధిక మంత్రి చెబుతూ దానిని మరచి, మద్యం ఆదాయాన్ని పెంచడం సరి కాదని తెలిపారు. మద్యపాన నిషేధంలో భాగంగా బెల్టు షాపులు మూసివేశామని, రెండో విడతగా ప్రైవేటు డీలర్ల నుంచి యాజమాన్యాన్ని ప్రభుత్వానికి మార్చి నియంత్రిస్తామని చెప్పారు.



కానీ బడ్జెట్ లో మద్యం ద్వారా వచ్చే ఆదాయ లక్ష్యాన్ని ఎక్కువగా పెట్టారని పేర్కొన్నారు. ఇది మద్యం నిషేదించే దిశగా లేదని ప్రభుత్వమే ప్రజల జీవితాలను మద్యం మత్తులో ముంచేలా ఉందని అభిప్రాయపడ్డారు. మద్యం నిరయంత్రణ చేస్తామని చెబుతూ మరోవైపు టార్గెట్ లు ఇవ్వడం అంటే మద్యం అమ్మకాలను పరోక్షంగా ప్రోత్సాహించడం అవుతోందని తెలిపారు.



మద్యం మత్తుకు బానిసైన వార్ని బాగుచేసేందుకు డి ఎడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని యువత మధ్యానికి ఆకర్షితులు కాకుండా అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రచారం చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ఆలోచనలతో మద్యం నిషేధం దిశగా అడుగులు వేయాలని సూచించారు. మద్యం షాపులను తగ్గించడంతో పాటుగా తాగడాన్ని కూడా తగ్గించేలా చర్యలుండాలని కోరారు. నూతన విధానం మద్యాన్ని నియంత్రించేలా రూపొందించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: