రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1,33,867 గ్రామ/వార్డ్ సచివాలయాల్లోని ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. గ్రామ సచివాలయంలోని ఉద్యోగాలకు అబ్జెక్టివ్ తరహాలో ఆఫ్ లైన్లో పరీక్షను నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకమైన సిలబస్ ను గ్రామ/వార్డ్ సచివాలయాల్లోని ఉద్యోగాల కోసం రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షకు 2 :30 గంటల సమయన్ని కేటాయిస్తారు. 
 
గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవని కేవలం పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబోతున్నారని తెలుస్తుంది. గ్రామ సచివాలయాల్లో 150 మార్కుల పరీక్షలో 75 మార్కులు జనరల్ నాలెడ్జ్, 75 మార్కులు ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు ఉండబోతున్నాయి. 18 నుండి 42 సంవత్సరాల వయస్సు  అర్హతగా నిర్ణయించబోతున్నట్లు సమాచారం కానీ ఉద్యోగాన్ని బట్టి అర్హత వయసు మారే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
వార్డ్ సచివాలయాల్లోని ఉద్యోగాల కోసం 50 మార్కుల జనరల్ నాలెడ్జ్, 50 మార్కుల ఎంపిక చేసిన సిలబస్ మరో 50 మార్కుల వ్యక్తిత్వ సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉండబోతున్నాయి.వేతనాన్ని 15,000 రుపాయలుగా నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం 15 నుండి 20 లక్షల ధరఖాస్తులు రాబోతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: