తాజగా   ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో ఇది అమరావతి కాదు భ్రమరావతే అని తేలిపోయింది. ఐదేళ్ళపాటు గ్రాఫిక్స్ లో జనాలకు చంద్రబాబునాయుడు త్రిశంకు స్వర్గం చూపారని తేలిపోయింది.  క్షేత్రస్ధాయికి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కూడా ఇక్కడ పనులు పెద్దగా  ఏమీ జరగటం లేదని అర్ధమైపోయింది.

 

పైగా వేలాది ఎకరాల్లో పంటలను, అడవులను ధ్వసం చేసి మరీ చంద్రబాబు చెబుతున్న భ్రమరావతి నిర్మాణం కూడా ప్రపంచ బ్యాంకు నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఉంది. దానికితోడు స్వచ్చంధ సంస్ధలు, వామపక్షాల నేతలు, మానవ హక్కుల సంఘాలు, రైతులు గతంలోనే చంద్రబాబుపై ఫిర్యాదు చేసున్నాయి.

 

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వకూడదని  ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.  కాకపోతే నిర్ణయం తీసుకునే సమయానికి, తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి సమాచారం అందించే సమయానికి మధ్య కొంత కాల వ్యవధి పట్టింది.

 

ఈమధ్యలోనే ఎన్నికలు జరగటం, టిడిపి ఘోరంగా ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో అధికారంలోకి రావటం జరిగింది. ఈ నేపధ్యంలోనే ప్రపంచ బ్యాంకు నిర్ణయం బయటకు వచ్చింది. దాంతో అదేదో జగన్ వల్లే ఏపికి జరిగిన అన్యాయంగా చంద్రబాబు అండ్ కో తో పాటు చంద్రబాబు మీడియా గగ్గోలు పెడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: