బెయిల్‌పై రేవతి విడుదల
మోజో టీవీ జర్నలిస్టు రేవతి పొగడదండ, శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, ' మా పోరాటం ఇంతటితో ఆగదు, జనవరిలో జరిగిన సంఘటనలో ముగ్గురు మహిళలపై కేసుపెట్టిన ప్రభుత్వం నన్ను జైలుకు పంపారు...' అన్నారు. తనను, తన భర్తను నాలుగు పోలీసు ఠాణాలకు చెందిన సిబ్బంది తీసుకొచ్చారని రేవతి తెలిపారు. తనకు జైలుకు వెళ్లేందుకు చక్కని అవకాశాన్నిచ్చి మంచి మంచి కథనాలు రాసుకునేందుకు వీలు కల్పించి నందుకు, ఇప్పటికీ తాను మైహోం గ్రూపు రామేశ్వర్‌రావ్‌, ఆయన కుమారుడు రామ్‌, మెగా క్రిష్ణారెడ్డికి రుణపడి ఉన్నట్లు చెప్పారు.

 మహిళా జర్నలిస్టు రేవతిని అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వ చర్య గర్హనీయమని టీజెఎస్‌ అధ్యక్షుడు ప్రో.కోదండరాం ఆరోపించారు. బెయిల్‌పై విడుదల  కాక ముందు మహిళా జైల్లో ఉన్న జర్నలిస్టు రేవతిని శుక్రవారం టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, రమేశ్‌, మమతలతో కలిసి పరామర్శించారు.

ఈ సందర్భఃగా మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులో మహిళా జర్నలిస్టును అరెస్టు చేయడం పట్ల ప్రభుత్వం రాజకీయపరమైన చర్చకు దారి తీసిందన్నారు. మీడియా పరంగా ఎటువంటి బేదాభిప్రాయాలున్నా వాటిపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చని, ఇలాంటి చర్యలు దిగడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. ఈ సంఘటన పై పలువురు జర్నలిస్టులు సోషల్‌ మీడియాలో, పాత్రికేయుల స్వేచ్ఛను కాపాడాలని, రేవతి పొగడదండ కి మద్దతుగా కామెంట్లు రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: