గత కొన్నేళ్ళుగా ఎక్కడ చూసినా ఫిరాయింపుల కధలే. జంపింగు జఫాంగులు ప్రజాస్వామ్యం పరువు తీస్తున్నారు. ఓటేసిన ప్రజలను దారుణంగా అవమానిస్తున్నారు. అధికారమే పరమావధిగా సాగుతున్న ఈ విక్రుత క్రీడ ఎంత వరకూ వెళ్ళిందంటే గెలిచిన పార్టీని, ఆ పార్టీ అధినాయకున్ని సైతం సవాల్ చేసేటంత నీచానికి దిగజారిపోయింది.


ఏపీలో 2014 నుంచి 2019 వరకూ ఫిరాయింపుల కంపు అంతా ఇంతా కాదు. ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాగేశారు. వారి నుంచి నలుగురుని ఎంపిక చేసి మరీ మంత్రులను చేశారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బాబు తీరుని జనంలో పెల్లుబుకిన ఆగ్రహమే తాజా ఎన్నికల ఫలితాలు. జనం ఏమీ పట్టించుకోరు, అంతా మన ఇష్టం వచ్చినట్లు చేస్తుకుందామనుకున్న తీరుకు ప్రజలు సరైన గుణపాఠం అలా చెప్పారు.


ఇపుడు ఏపీలో అదే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి మిగిలారు. విషయమేంటంటే చట్ట సభల్లో నీతులు వల్లిస్తున్న చంద్రబాబుకు ఇపుడు చట్టాలను ఆయన ఎంతల చట్టుబండలు చేసాడో సభ సాక్షిగా అందరికీ తెలియచేయాలని వైసీపీ నిర్ణయించింది. దాంతో ఆ పార్టీకి చెందిన అన్నా రాంబాబు  ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మంత్రి అనిల్ కుమార్ కూడా మద్దతు పలికారు.


స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా దీని మీద చర్చించి దేశానికి మంచి సందేశం ఇద్దామని చెప్పారు. సభానాయకుడు జగన్ తో మాట్లాడిన తరువాత చర్చకు పెడదామని తమ్మినేని హామీ ఇవ్వడంతో ఇపుడు టీడీపీ ఇరకాటంలో పడినట్లైంది. ఫిరాయింపులపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగితే మాత్రం టీడీపీ పంబ రేగడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: