ఏపీలో ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ కి ఎదురులేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 23 సీట్లతో తన పార్టీని కుదేలు చేసుకున్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తే టీడీపీకి వ్యతిరేకంగా ఉంది. బాబు సీనియరిటీ పక్కన పెడితే తమ్ముళ్ళ తీరుని జనం ఇప్పటికీ చీదరించుకుంటున్నారు.


అసెంబ్లీలో బయటా చంద్రబాబు అండ్ కో అవినీతిని బయట వేస్తూ వైసీపీ చేస్తున్న ప్రచారం టీడీపీకి గుక్క తిప్పుకోనీయడంలేదు. కుభంకోణాలు, అవినీతి ప్రస్తావన ద్వారా జగన్ ఆ పార్టీని మళ్ళీ లేచి నిలబడే అవకాశం అసలు ఇవ్వదలచుకోవడంలేదు. ఈ నేపధ్యంలో నుంచి చూసుకుంటే మాత్రం ఏపీలో జగన్ రాజకీయం వన్ సైడ్ గా సాగుతోంది.


మరి ఏపీలో బలపడదామనుకుంటున్న బీజేపీకి సరైన అభ్యర్ధి ఇపుడు దొరికేశారట. ఆయన ఎవరో కాదు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. నిజాయతీపరుడుగా పేరున్న కిరణ్ ఏపీ ప్రజలకు సీఎం గా తన పాలనలో కొంత మేలు చేసాడన్న పేరు ఉంది. ఆయనకు వెనక బలం లేదు కానీ ఉంటే కీలక నేతగా అవతరించేవారే. ఆయన్ని బీజేపీలోకి తీసుకువడం ద్వారా జగన్ కి గట్టి పోటీ ఇద్దామని బీజేపీ ప్లాన్ చేస్తోంది.


అప్పట్లో అంటే 2011 తరువాత  కాలంలో కిరణ్ వర్సెస్ జగన్ గా కధ నడిచింది. ఇపుడు జగన్ సీఎం అయ్యారు. కిరణ్ అంటే జగన్ కి అసలు పడదు, ఇక కిరణ్ సైతం జగన్ మీద ఒంటి కాలి మీద లేస్తారు.  కిరణ్ ని  రంగంలో పెడితే ఏపీలో రాజకీయం సానుకూలం అవుతుందని బీజేపీ భావిస్తోందట. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: