అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. సంఖ్యా బలంతో సంబంధం లేకుండా టిడిపికి మాట్లాడే అవకాశం ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ను ఎందుకు కోరారో ఇపుడు అందరికీ అర్ధమైపోతోంది. పైగా తాను మాట్లాడుతున్నపుడు చంద్రబాబునాయుడు మాట్లాడాలని చేయిని పైకెత్తగానే జగన్ కూర్చునేస్తున్నారు. మామూలుగా ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా అలా జరగదు.

 

అసెంబ్లీ మొదటి సమావేశం నుండి ఏపి అసెంబ్లీలో ఇదే తంతు కనిపిస్తోంది. చంద్రబాబు ఏమి చెప్పుకుంటారో చెప్పుకునేందుకు పూర్తి అవకాశం ఇవ్వమని స్వయంగా జగనే స్పీకర్ ను కోరటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తర్వాత మాట్లాడిన జగన్ అండ్ కో ప్రతిపక్ష నేతను వాయించేస్తున్నారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబును మాట్లాడనిస్తున్నాడంటే జగన్ ఏమీ పిచ్చోడై కాదు. గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి కంపు అంతా ఇంతా కాదు. కాబట్టి ఎలాగూ తన పాలన బ్రహ్మాండమనే చంద్రబాబు చెప్పుకుంటారు. కాబట్టి ముందు చంద్రబాబును చెప్పుకోనిచ్చి తర్వాత జగన్ కానీ మంత్రులు కానీ ఫుల్లుగా మాజీ సిఎంను వాయించేస్తున్నారు.

 

అంటే ఒకరకంగా జగన్ అండ్ కో చంద్రబాబును ఉచ్చులోకి లాగుతున్నారు. చంద్రబాబు కూడా ముందు వెనక చూసుకోకుండా ఆవేశంలో ఉచ్చులో పడిపోతున్నారు. టార్గెట్ గా చేసుకుని జగన్ మాట్లాడుతున్నపుడు చంద్రబాబు మొహం చూసిన వారికి అయ్యో పాపం అనిపిస్తోంది. పగోడికి కూడా ఇటువంటి పరిస్దితి రాకూడదన్నంతగా వాయించేస్తున్నారు. ఏం చేస్తాం చేసుకున్నవాడికి చేసుకున్నంత అని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: