అందేంటీ అంత పెద్ద వ్యాపార సంస్థ..టెక్నాలజీ ఎంతో ఫార్వర్డ్ లో ఉంటుంది, అలాంటిది అమెజాన్ తప్పు చేయడం ఏంటా అనుకుంటున్నారా? అవును ఎంత పెద్ద సంస్థలైనా కొన్నిసార్లు తప్పులు చేయడం సహజం, అయితే వాటికి భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది.  తాజాగా అమెజాన్ చేసిన చిన్న పొరపాటు వల్ల కస్టమర్లు సంబరాలు చేసుకున్నారు.

సాధారణంగా అమెజాన్ 40, 50 పర్సెంట్ ఆఫర్లు ఇస్తుంది.   కానీ, అమెజాన్ చేసిన ఓ పొరబాటు కస్టమర్ల పాలిట వరమైంది. కొనుగోలు ధర పేర్కొనాల్సిన చోట అంకెల్లో జరిగిన పొరబాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని ఫలితమే రూ.9 లక్షల విలువైన బ్రాండెడ్ కెమెరాను రూ.6,500కి ఎగరేసుకెళ్లారు.
అసలు విషయానికి వస్తే.. సోనీ ఎ6000 కెమెరాకు కూడా ఇదే గతి పట్టింది.  అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా ఓ అత్యాధునిక కెమెరాపై కూడా ఆఫర్ ఇచ్చింది.

అయితే, కొనుగోలు ధరను కేవలం రూ.6,500గా పేర్కొనడంతో కస్టమర్లు కుమ్మేశారు. దీని అసలు ఖరీదు రూ.9 లక్షలు. సోనీ ఎ6000 కెమెరా కూడా ఇదే రేంజ్ లో అమ్ముడు పోయింది. దీని వాస్తవ ఖరీదు రూ.4 లక్షలు కాగా, వినియోగదారులు దీన్ని సైతం అత్యంత చవకగా రూ.6,500కి దక్కించుకున్నారు.అయితే, తాము అత్యంత చీప్ గా కొన్న కెమెరాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టేసరికి అమెజాన్ చూసి అవాక్కయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: