వైసీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కు విధేయుడు. అయితే మొదటి మంత్రి వర్గంలో అతనికి అవకాశం రాలేదు. అయితే కేవలం రెండోసారి మాత్రమే ఎమ్మెల్యే అయిన ఆయనకు ఆ పదవి దక్కలేదని తర్కించుకున్నారు. అయితే చెవిరెడ్డికి ఏదైనా పదవిని ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే అనుకున్నారు. ఆ మేరకు విప్ పదవి మొదట లభించింది. అది చిన్నదే అనుకుంటే, ఆ వెంటనే తుడా చైర్మన్ పదవి దక్కింది. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా)కు గతంలో కూడా చైర్మన్ గా పనిచేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.


ఆ పదవితోనే ఆయనకు గుర్తింపు లభించింది అప్పట్లో. ఇప్పుడు చంద్రగిరి ఎమ్మల్యే అయినప్పటికీ ఆయనకు తుడా చైర్మన్ పదవిని కేటాయించారు. అక్కడకూ చెవిరెడ్డి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా న్యాయం జరిగింది అని అనుకున్నారు. అయితే ఇప్పుడు టీటీడీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు చెవిరెడ్డి. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆయనకు అవకాశం లభించింది. మామూలుగా తుడా చైర్మన్ హోదాలో ఉన్న వారికి టీటీడీలో ఆ హోదా దక్కే అవకాశం ఉంటుంది.


కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే జరిగింది. అప్పట్లో చెవిరెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా టీటీడీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వ్యవహరించారు. అయితే  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తుడా చైర్మన్ కు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ చెవిరెడ్డికి గతంలాగే అవకాశం లభించింది. ఇలా వరస పదవులు ఆయనకు దక్కుతున్నాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆశ్చర్యపోతూ ఉండటం గమనార్హం!

మరింత సమాచారం తెలుసుకోండి: