ఈశాన్య రాష్ట్రం లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన  బ్రహ్మపుత్ర నదితో వరదతో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్ ని సైతం వరదతో బ్రహ్మపుత్రా, జాన్ సిరి, జియా భరాలు, కొప్పిల్లి నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదపు శాతం దాటి వ్యతిరేఖంగా ప్రవహిస్తున్నాయి.



రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ఐదు గ్రామాలు వరదతో ముంపుకు గురయ్యాయి. నలభై ఎనిమిది లక్షల మందికి పైగా వరదకు నిరాశ్రయులయ్యారు. అసోంలో మృతుల సంఖ్య నలభై ఏడుకు చేరింది. బీహార్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్ లు వరదలకు తెగిపోయాయి.



కొన్ని ఏరియాల్లో చెరువుల కట్టలు తెగి పోవడంతో గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి.వరదలో చిక్కుకున్న వారిని రక్షణ బృందం కాపాడుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: