ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సాధారణ పాస్‌పోర్ట్ స్థానంలో డిప్లమాటక్ పాస్‌పోర్ట్‌ను అందజేశారు. ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి విజయవాడ పాస్ పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన జగన్ తన డిప్లొమేటిక్ పాస్ పోర్టును తీసుకున్నారు. సీఎంకి అధికారులు ఈ పాస్‌పోర్ట్‌ను అందజేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, రాయబారులకి మాత్రమే ఈ పాస్‌పోర్ట్ జారీచేస్తారు. 

ఈ పాస్ పోర్ట్ ప్రత్యేకతలు :

విమానాశ్రయంలో నేరుగా ప్రవేశించే అవకాశం ఉంది.  విదేశాల్లో పనిచేసే భారత దౌత్య సిబ్బంది, వారి కుటుంబీకులకూ ఈ పాస్ పోర్టును ఇస్తుంది. అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు. విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేకమైన లాంజ్ కూడా ఉంటుంది. అలాగే విమానం బయలుదేరడానికి గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలన్న నిబంధన ఉండదు. నేరుగా తాము వెళ్లాల్సిన విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో చేరుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: