వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు అంతటి వారు లేరని రాజకీయ వర్గాల్లో పేరు ఉంది. అందుకే చంద్రబాబు అవినీతిపై పాతిక పైగా కేసులు ఉన్నా.. అన్నింట్లోనూ స్టేలు తెచ్చుకుని తప్పించుకుంటున్నారన్న వాదన కూడా ఉంది. ఓ రిటైర్డ్ జడ్డి కోసం చంద్రబాబు ఏకంగా నిబంధనలనే సవరించారట.


ఈ విషయాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. తనకు కావల్సిన రిటైర్డ్ జడ్జి కోసం విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ చైర్మన్ పదవి వయోపరిమితిని పెంచారని జగన్ విమర్శించారు. తన వారి కోసం ఈ పరిమితిని డెబ్బై ఏళ్లకు పెంచారని జగన్అంటున్నారు.


అయితే ఈ వాదనకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. న్యాయ వ్యవస్థపై ముఖ్యమంత్రి కామెంట్ చేయడం సరికాదని అంటున్నారు చంద్రబాబు. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తిని నియమించామని... ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించారని తన చర్యను చంద్రబాబు సమర్థించుకున్నారు.


న్యాయమూర్తుల గురించి విమర్శలు చేయకూడదని.. వారిపై అనుమానం కలిగేలా మాట్లాడకూడదని చంద్రబాబు అంటున్నారు. వారిని గౌరవించాలని అనవసర వివాదాల్లోకి లాగవద్దని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: