వైఎస్ జగన్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం బీజేపీ నేతలకు అసలు మింగుడుపడడంలేదు. ఒక్క మోడీ విజయాలను మాత్రమే ఆస్వాదించడానికి అలవాటుపడిన కమలధారులకు మరొకరు అద్భుత విజయాలు సాధిస్తే కన్ను కొడుతుంది. ఏపీలో జగన్ గ్రాండ్ విక్టరీని ఇపుడు బీజేపీ తట్టుకోలేకపోతోంది. అంతే వైసీపీ గెలిచిన మరు క్షణం నుంచి అటాక్ మూడ్లోకి వెళ్ళిపోయింది.


జగన్ని అపుడే జనంలో బదనాం చేసేందుకు రెడీ అవుతోంది. జగన్ వల్లనే ఏపీకి ఇన్ని కష్టాలు అంటూ ఏడుపు స్టార్ట్ చేసేంది. జగన్ అధికారంలోకి వచ్చి నిండా యాభై రోజులు కూడా కాలేదు కానీ జగన్ పాలనలో ఫెయిల్యూర్ అంటూ హాట్ కామెంట్స్ చేస్తోంది. జగన్ పై బీజేపీ విమర్శలు ఎలా ఉన్నాయంటే టీడీపీని సైతం పక్కన పెట్టి తామే రేపటి వీరులం అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు.


విశాఖలో చర్చిలకు సెక్యూరిటీ ఇమ్మంటూ పోలీస్ అధికారి స్థాయిలో జారీ చేసిన ఆదేశాలపై ఇపుడు బీజేపీ మండిపోతోంది. ఇదొక అస్త్రంగా చేసుకుని పురంధేశ్వరి నుంచి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వరకూ, కన్నా లక్ష్మీ నారాయణ వరకూ కూడా ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. మత రాజ్యం స్థాపిస్తారా అంటూ రెచ్చిపోతున్నారు. ఇక టీటీడీ బోర్డ్ మెంబర్ గా సినీ నటుడు అలీ నియామకంపై కత్తి మహేష్ అనే సినీ విమర్శకుడు సానుకూలంగా పెట్టిన పోస్టింగును తీసుకుని అపచారం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. 


చూడబోతే జగన్ మీద మతం కార్డ్ ని ఉపయోగించి ఎదుర్కోవాలని బీజేపీ రెడీ అవుతోందని అంటున్నారు. అయితే ఏపీ ప్రజలు  మతాలకు అతీతులు, ఇక్కడ రెచ్చగొట్టుడు వైఖరి పనికిరాదు అన్న సంగతి బీజేపీ పెద్దలకు ఇంకా తెలియదేమోనని సెటైర్లు పడుతున్నాయి. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా కూడా బీజేపీకి ఏపీలో మంచి నీళ్ళు పుట్టవని కూడా అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: