ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ మొదటిసారి తన ట్విట్టర్ లో ఎవరు ఊహించని విధంగా సంచలన ట్విట్ చేశారు. ఆ ట్విట్ ని పాలకపక్షం చూస్తే 'అబ్బా' అంటుంది అని అంటున్నారు నెటిజన్లు.
 
పాలకపక్షం అబ్బా అనేంతలా నారా లోకేష్ ఎం ట్విట్ చేశారు అని ఆలోచిస్తున్నరా ? ఎప్పుడు పాలక పక్షాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నారా లోకేష్ మొదటిసారి ఓ ఫోటో షేర్ చేస్తూ అధికారం అనేది శాశ్వతం కాదు అని ఒప్పుకుంటూ ట్విట్ చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ ట్విట్ ఏంటో చుడండి...     


ఓ వ్యక్తి తెలంగాణాలోని హైదరాబాద్ లో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బ్యాగ్ వేసుకొని భోజనం తింటున్నప్పడు తీసుకున్న ఫోటోని తన ఫేసుబూక్ అకౌంట్ లో షేర్ చేస్తూ 'అధికారం ఉన్న లేకున్నా అన్నం పెట్టె పార్టీ తెలుగుదేశం. హైదరాబాద్ లోని తెలుగుదేశం కార్యాలయం' అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ని నారా లోకేష్ షేర్ చేస్తూ 'అధికారం కాదు, బంధాలు మాత్రమే శాశ్వతం' అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ కు కొందరు నెటిజన్ల శభాష్ అంటుంటే మరికొందరు అబ్బా, అవునా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: