తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బీజేపీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. బీజేపీ అండదండలతోటే అధికారం చేప్పట్టిన ఆయన ఇటీవల  కార్యకర్తల సమావేశంలో మోదీ ని ఘాటుగా విమర్శించారు. మోదీ ది ఓ గెలుపానా... అంటూ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో మరో సారి గులాబీ జెండ వాడవాడలా ఎగరెయ్యాలని, బీజేపీ, కాంగ్రెస్ లు  టీఆరెస్ పార్టీ కి పోటీయే  కాదని కార్యకర్తలకు తెలియజేసారు. 2019 ఎన్నికల్లో దేశభక్తి సెంటిమెంట్ ని  రెచ్చగొట్టి, బీజేపీ లేకపోతే దేశానికి భద్రత లేదనే అభద్రతా భావాన్ని సృష్టించి ఎన్నికల్లో గెలిపొందారని ఆరోపించారు. 

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి టీఆరెస్ గట్టిపోటీ ఇవ్వనున్నట్టు కేసీఆర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ  కాంగ్రెస్ నాయకులను  బీజేపీలోకి తీసుకోవడం , తెలంగాణాలో బీజేపీ భలోపేతానికి ఆ పార్టీ చేస్తున్న సన్నాహాలతో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
 తెలంగాణ వాస్తవ రాజకీయాలను పరిశీలిస్తే ... సమైక్యాంధ్ర ఉధ్యమంలో  కాంగ్రెస్ పార్టీకి టీఆరెస్ అనుకూలంగా వ్యవహరించింది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక తీసుకుంది. టీఆరెస్ కు అనుకూలంగా వ్యవహరించడంతో  2014 ఎన్నికల్లో టీఆరెస్ గెలుపు సునాయాసమైంది. అనంతర రాజకియ  పరిణామాల నేపథ్యంలో టీఆరెస్ బలోపేతం కావడంతో కాంగ్రెస్ కు దూరమైంది. 

 ఈ నేపద్యంలో కేంద్రంలోని బీజేపీ , టీఆరెస్ తో సానుకూలంగ వ్యవహరించడంతో కేసీఆర్ మోదీకి అభిమానిగ మారారు.  కేంద్రంలో తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి పనులు చేయించుకోవడంలో కేసీఆర్ సఫలీ కృతులయ్యారు. దీనిని ఆసరాగా చేసుకొని బీజేపీని భలోపేతం చేయడానికి ఆ పార్టీ  సన్నాహాలు చేపట్టిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: