రాష్ట్రంలో చోటుచేసుకుంటన్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే  భవిష్యత్తులో బీజేపీ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగతెంపులు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ అండతోనే అధికారం చేపట్టిన వైఎస్సార్ సీపీ బీజేపీ వ్యవహార శైలితో  విసికివేసారిపోతోందనొ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలలో పదిహేను మందిని బీజేపీలో కలుపుకునే ప్రయత్నం చేయడం , గవర్నర్ గా  బీజేపీ పార్టీకి చెందిన  బిశ్వభూషన్‌ హరిచందన్‌ను  గవర్నర్ గా అపాయింట్‌ చేయడం, బీజేపీ రాష్ట్ర నాయకుల  అనుచిత వ్యాఖ్యానాలు చేయడం,  తదితర కారణాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుందని  రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రచారం చేయడం ఒక విధంగా విమర్శలకు తావిస్తోంది.

2024 ఎన్నికల్లో బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధీకారం చేపట్టాలనే ఆకాంక్షతో ఆ పార్టీ  నాయకులు పనిచేస్తున్నారు. దానికి తోడు గత మాజీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ లో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా బొత్స , ధర్మాన బీజేపీతో  టచ్లో ఉన్నారని ఆ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ మాధవ్‌ చెప్పటం వైసీపీకి కొంచెం ఇబ్బందికరమైన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: