దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువరోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం షీలా దీక్షిత్.  షీలా దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి.  కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి ఆమె అనుకోకుండా వచ్చారు.  


రాజకీయాల్లోకి రాకముందు.. చదువుకునే రోజుల్లో ఆమె ఒక అబ్బాయిని ప్రేమించింది.  అతని పేరు వినోద్.  షీలా పెద్దగా ఎవరితోనూ కలిసేది కాదట.  వినోద్ దానికి రివర్స్.  దూకుడుతత్వం ఎక్కువ.  చదువు పూర్తి కావొస్తున్న చివరి రోజుల్లో షీలా దీక్షిత్ స్నేహితురాలు, వినోద్ స్నేహితుడితో ప్రేమలో పడింది.  వాళ్ళిద్దర్నీ కలిపించేందుకు షీలా, వినోద్ లు ప్రయత్నించారు.  వాళ్ళ ప్రేమ సమస్యను పరిష్కరించి క్రమంలో వీళ్లిద్దరి మనసులు కలిశాయట.  


వినోద్ తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆమె ఒకే చెప్పింది.  షీలా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు.  అబ్బాయి తరపు ఇంట్లో వాళ్ళ నాన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉమాశంకర్ దీక్షిత్ కూడా ఒకే చేశారు.  కానీ, వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు.  అప్పటికే వినోద్ ఐఏఎస్ కు సలెక్ట్ అయ్యారు.   వినోద్ వాళ్ళ అమ్మను ఒప్పించడానికి రెండేళ్లు పట్టింది.  


అంతా ఒకే అనుకున్నాక వివాహం జరిపించారు.  అది చాలా సింపుల్ గా జరిగిపోయింది.  షీలా దీక్షిత్ వినోద్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన తరువాతే రాజకీయాల్లోకి ప్రవేశించింది.  అలా ఆమె రాజకీయాల్లోకి రావడం.. ముఖ్యమంత్రి కావడం అన్ని జరిగిపోయాయి.  షీలా దీక్షిత్ ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: