బడ్జెట్ సమావేశాలతో  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోతోంది.   ప్రతి రోజు ఏదొక విషయం మీద  అధికార పక్షానికి, బాబు  అడ్డం తగులుతూనే ఉన్నాడు.  వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.  దీంతో బాబును ఆపటానికి  జగనే రంగంలోకి దిగుతున్నా.. అలాగే వైసీపీ నాయకులూ  బాబును ఇరుకున పెట్టాలని  ఎంత కష్టపడుతున్నా..   పరిస్థితి మాత్రం వైసీపీకి అనుకూలంగా రావడం లేదు.  బాబుకి ఉన్న అనుభవం  విషయ జ్ఞానం  జగన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. అందుకే  బాగా ఆలోచించిన జగన్  ఒక ప్లాన్ వేసాడట. 


సోమవారం తిరిగి ప్రారంభకానున్న సభలో  బాబుని ఎలాగైనా ఇరుగున పెట్టడానికి...  పార్టీ ఫిరాయింపుల మీద అసెంబ్లీ లో చర్చ జరపాలని నిర్ణయించారట. బాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజలకి తెలియాలని, టీడీపీ నాయకులూ  ఎంతెంత సంపాదించారో..  ఎన్నెన్ని అక్రమాలు చేశారో అవన్నీ ప్రజలకి తెలియాలని   సోమవారం అసెంబ్లీలో ప్రధానంగా  దానిపై చర్చ జరగాలని భావిస్తోన్నాడట.  


అయితే నిజంగా ఈ  ఫిరాయింపుల కారణంగా  దేశంలోనే మొదటిసారి దీని పై  చర్చలు చేసిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వానికి   మంచి పేరొస్తుంది.  అలాగే  సోమవారం ఫిరాయింపుల మీద చర్చలు జరిగితే  టీడీపీ అండ్ బాబు కనీసం స్పష్టంగా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో....   బాబు బుకైపోవటం ఖాయం అని జగన్ ప్లాన్ చేస్తున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: