మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మిస్తున్నసంస్థ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనే అనేక క్లిష్టమైన ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అయితే ఈ సంస్థ గురించి ఓ ఆంగ్లపత్రికలో సంచలన కథనం ప్రచురితమైంది.


మేఘా సంస్థపై జీఎస్టీ దాడులు జరిగాయన్నది ఆ కథనం సారాంశం. అనేక కీలక ఆధారాలు లభించినట్టు కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ కథనంపై మేఘా సంస్థ మండిపడుతోంది. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.


అన్ని వ్యవహారాల్లోనూ తమ సంస్థ నియమ నిబంధనలకు లోబడే సంస్థ పని చేస్తోందని మేఘా సీఈవో మీడియాకు తెలిపారు. రెండేళ్లుగా పన్ను చెల్లింపుదారుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా జీఎస్టీని చెల్లించి సంస్థ మేఘా సంస్థనే అని వివరించారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక తమ కంపెనీ మూడువేల కోట్లు చెల్లింపులు చేసిందని సీఈవో వివరించారు.


తమ సంస్థ గురించి దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని మేఘా సంస్థ చెబుతోంది. పన్ను చట్టాలను ఎప్పుడూ తమ సంస్థ గౌరవిస్తుందని సీఈవో వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: