మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నిర్వాహకం వల్లనే ప్రపంచబ్యాంక్ రుణం రాలేదా  అంటే అవుననే అంటున్నారు వైకాపా నేతలు . చంద్రబాబు  అసమర్ధత వల్లనే ఇలా జరిగిందని , రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయస్కామ్ కు పాల్పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు . రాజధాని అమరావతి పేరిట బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ...  మీడియా ప్రచారార్భాటాలు తప్ప, కనీసం రాజధానిలో  రహదారులు కూడా నిర్మించలేదన్నారు . అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారన్నారు .


ప్రపంచబ్యాంక్ ద్వారా జూన్ 12 న ఓ లేఖ వచ్చిందంటున్న వైకాపా నేతలు , వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల వద్దనుంచి  లాక్కుందని ఆ లేఖలో పేర్కొందని  చెబుతున్నారు . ప్రపంచబ్యాంక్ రుణం వెనకకు వెళ్లడమేంటనీ , ఆ బ్యాంక్ ఎప్పుడు రుణం ఇస్తానని చెప్పిందని ప్రశ్నిస్తున్నారు . అప్పటికీ ,  వైయస్ జగన్  అధికారం చేపట్టి కేవలం 12 రోజులైందన్నారు . చంద్రబాబు నిర్వాహకం వల్లనే ప్రపంచబ్యాంక్ రుణం రాలేదంటున్న వైకాపా నేతలు  ,  అయన  అసమర్ధత వల్లనే రుణం రాలేదని అంటున్నారు .


రాజధాని నిర్మాణంపై చంద్రబాబు టిడిపి నేతలు  తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలు మండిపడుతున్నారు . రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు  ఎంత దోచుకున్నారో అంతా బయటకు తీయిస్తామని  హెచ్చరిస్తున్నారు  . రాజధాని ప్రాంత రైతులకు టీడీపీ ప్రభుత్వ హయాం లో  ఏమాత్రం న్యాయం జరగలేదని , రాజధాని  ప్రాంతంలో భూములు కేటాయింపుల దగ్గర్నుంచి అన్నింటా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు . 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: