వైఎస్ జగన్ అలాంటి ఇలాంటి గెలుపు సాధించలేదు. ఆయన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. యాభై శాతం ఓట్లు, 85 శాతం సీట్లు అంటే రేర్ ఫీట్. దాన్ని సాధించిన జగన్ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఈ భారీ విజయం జగన్ని ఏం చేసింది. ఆయనకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి.


జగన్ విజయం ఇలాంటిది సాధిస్తారని ఏపీలో రాజకీయ పక్షాలేవీ వూహించలేకపోయాయి. అంతేందుకు జగన్ సైతం అనుకోలేదు. కానీ అది నిజమైంది. దీంతో ప్రత్యర్ధి పార్టీలకు జగన్ కన్నెర్ర అయ్యారు. అనూహ్యంగా ఆయన బీజేపీకి ప్రధాన విలన్ అయిపోయారు. ఈ విజయం వల్ల జగన్ ఎక్కడ పాతుకుపోతారోనని బీజేపీ ఆయన్ని వెంటెనే బలహీనున్ని చేయాలని ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా జగన్ నాయకత్వంలోని ఏపీని పూర్తిగా పట్టించుకోరాదని కూడా డిసైడ్ అయిపోయింది.


మరో వైపు టీడీపీకి జగన్ భారీ విజయం ఈ రోజుకు కూడా మింగుడు పడడంలేదు. జగన్ని ఎలాగైనా దెబ్బ తీయాలన్న ఆ పార్టీ కసి మరింతగా పెంచేలా ఈ విజయం వచ్చింది. దాంతో తన పార్టీని నాశనం చేసుకున్నా సరే వైసీపీని, జగన్ని ఏపీలో బతకనీయకూడదన్న దుష్ట పన్నాగాలకు టీడీపీ సిధ్ధపడిపోతోంది. అందుకో భాగమే టీడీపీ నుంచి బీజేపీ వైపు వలసలు. వాటి మీద చంద్రబాబు కనీసం కిమ్మనడంలేదంటే  ఎంత పకడ్బంధీగా ప్లాన్ వర్కౌట్ అవుతోందో చూడాలి.


ఇంకోవైపు జగన్ శత్రువులుగా ఉన్న వారు అన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరి సర్దుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాలేదు కానీ కుల సంఘాల నాయకులు కూడా ఘీంకరిస్తున్నారు. మరో వైపు టీడీపీ అనుకూల మీడియా సైతం జగన్ని బదనాం చేసేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఓ విధంగా జగన్ పద్మ వ్యూహంలో  చిక్కుకున్నారు. ఆయనకు ఇంతటి విజయం దక్కడేమే వూరట. కానీ పీఠమెక్కాక మాత్రం సమస్యలేం సమస్యలు. వీటిని ఎలా ఛెదిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: