తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు తప్ప మరొక ధ్యాస ఉండదు . అటువంటి చంద్రబాబు సమయం వెచ్చించి ఒక గాయానికి లేఖ రాయడం హాట్ టాఫిక్ గా మారింది. చంద్రబాబు రాసిన లేఖ ను అందుకున్న సదరు గాయని ఉబ్బి , తబ్బిబ్బు అవుతున్నారు .


 శ్రోతలను సంతోషపెట్టేందుకు స్మిత సంగీతాన్ని వేదిక చేసుకుని చేసుకుని చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని చంద్రబాబు అన్నారు . సంగీతానికి ఎల్లలు లేవన్న విషయాన్నీ నిరూపిస్తూ తొమ్మిది భాషల్లో పాడడం సాధారణ విషయం కాదన్నారు . భవిష్యత్తు లో కూడా ఇలాగే తన గానమాధుర్యాన్ని కొనసాగించాలని ఆకాక్షించారు .


 రాజకీయాల్లో నిత్యం తలమునకలై ఉండే చంద్రబాబు కాసింత సమయం దొరికితే కుటుంబం తో గడిపేందుకు అవకాశం ఇస్తారే తప్పితే సినీ , సంగీత రంగాల పట్ల మక్కువ ప్రదర్శించిన దాఖాల్లేవు . అటువంటి చంద్రబాబు అనూహ్యంగా స్మిత గాయనిగా 20 ఏళ్ల  కెరీర్  పూర్తి చేసుకున్న సందర్బంగా లేఖ రాసి అందర్నీ ఆశ్చర్యపరిచారు . తనకు లేఖ రాసిన చంద్రబాబు నాయుడు కు స్మిత ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: