వై.ఎస్.జగన్.. ఏపీకి యువ ముఖ్యమంత్రిగా, చరిష్మా ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆయనను గమనిస్తే.. ఎప్పుడూ సన్నటి గడ్డంతో కనిపిస్తున్నారు. ఆ గడ్డం అంత గుబురూ కాదు.. అలాగని క్లీన్ షేవ్ కాదు.


ఈ సన్నగడ్డం వెనుక కథ ఏంటి.. ఓసారి పరిశీలిస్తే.. జగన్ గతంలో రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తర్వాత చాలా కాలం క్లీన్ షేవ్ తోనే కనిపించారు. కానీ.. ఆ లుక్ తో జగన్ కు జన నాయకుడిగా గుర్తింపు రాలేదు.


రాజకీయాల్లో యువకుడైన జగన్.. క్లీన్ షేవింగ్ కారణంగా మరింత యువకుడిగా కనిపించేవారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వ్యక్తి మరీ అంత కుర్రాడిగా కనిపించడం కూడా ప్రజలకు రుచించలేదు. ఏదో పిల్ల చేష్టలు అని కొందరు వృద్దులు భావించేవారు.


దీంతో ఆ తర్వాత కాలంలో జగన్ స్టయిల్ మార్చారు. క్లీన్ షేవింగ్ కు టాటా చెప్పేసి కాస్త గడ్డం పెంచడం ప్రారంభించారు. ఆ తర్వాత ట్రిమ్ చేయడమే తప్ప క్లీన్ షేవింగ్ చేయడం లేదు. సన్నగడ్డంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అటు సామాన్యుడిగా కనిపించవచ్చు. కాస్త మేధావిగానూ కనిపించవచ్చు.


సన్నగడ్డం స్టయిల్ లోకి వచ్చాక జగన్ కు జనాదరణ కూడా పెరిగింది. అందుకేనేమో ఇప్పట్లో జగన్ గడ్డం స్టయిల్ మార్చే అవకాశాలు కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: