ఎన్నికల్లో అధికారం కోసం నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారు. అధికారంలోకి రాగానే వాటిని తమకు అనుకూలంగా మరచిపోతుంటారు. కానీ.. తాను అలాంటి వాడిని కాదంటూ జనంలో తిరిగారు వైఎస్ జగన్. పాదయాత్రలో ఎన్నో హామీలు గుప్పించారు.


ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తున్నారు. కానీ.. కీలకమైన మూడు అంశాలపై మాత్రం ఇంకా జగన్ సర్కారు నుంచి క్లారిటీ రాలేదు. జగన్ అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలే అవుతోంది.


ఇంతలోనే అన్ని హామీలు నెరవేర్చాలని ఎవరూ ఆశించడం లేదు. కానీ ఓ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ అంశాలేంటో చూద్దాం.. వాటిలో మొదటిది పెన్షన్ల విషయం. తాను అధికారంలోకి వస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.


దీనిపై ఇప్పుడు ఎలాంటి మాటా చెప్పడం లేదు. మరో హామీ.. అవ్వా, తాతలకు పెన్షన్.. ప్రస్తుతం ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులు ఉంటే ఎవరికో ఒక్కరికే పెన్షన్ వస్తుంది. జగన్ అధికారంలోకి వస్తే అవ్వా, తాతా ఇద్దరికీ పెన్షన్ ఇస్తానన్నారు.


ఇక మరో హామీ సన్నబియ్యం. అధికారంలోకి వస్తే.. రేషన్ ద్వారా సన్నిబయ్యం అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ మూడు కీలకమైన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదు. అలాగని నెరవేర్చకుండా ఉంటే మాటతప్పిన వాడు అవుతాడు జగన్. మరి సీఎం ఈ మూడు అంశాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటాడో.. ప్రజలను ఎలా సమాధానపరుస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: