మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా పవన్ కల్యాణ్ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. అసలు జనసేన పార్టీ ఉంటుందా.. మూసేస్తారా అన్న అనుమానాలకు తన ప్రాణం పోయే వరకూ జనసేన పార్టీ ఉంటుందని తేల్చిచెప్పారాయన. అందుకు అనుగుణంగానే ఫలితాలు వచ్చిన తర్వాత కొన్నిరోజులు పార్టీ కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొన్నారు.


కానీ కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ జాడ కనిపించడం లేదు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల వేళ కీలకమైన అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్దం మొదలైంది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష, ప్రపంచ బ్యాంకు రుణంపై వెనుకంజ వంటి అంశాలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమవుతున్నాయి.


మరోవైపు తెలంగాణతో కలసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశంపై కూడా రాష్ట్రవ్యాప్తంగా జనంలో చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై కీలకంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ మాత్రం అంత చురుకుగా వ్యవహరించడం లేదు. కీలకమైన అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ వైఖరిని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నం కూడా కనిపించడం లేదు. మరి ఇంతటి సువర్ణావకాశాన్ని పవన్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: