మంత్రి పేర్నినాని నియోజకవర్గంలో ఓ ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నంపై విశ్లేషించిన సీనియర్ జర్నలిస్టు సాయిని వైసీపీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం వివాదానికి దారి తీస్తోంది. ఈ ఆత్మహత్యాయత్నానికి మంత్రి బాధ్యత తీసుకోవాలనే కోణంలో ఆ సీనియర్ జర్నలిస్టు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పోస్టు చేశారు.


ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ ఫ్యాన్స్ జర్నలిస్టు సాయిని విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారట. ఈ విషయాన్ని ఆయన మరో వీడియోలో ప్రస్తావించారు. సమాజంలో జరిగే ఘటనలకు అధికారంలో ఉన్నవారు తప్పకుండా బాధ్యత వహించాల్సి ఉంటుందని సాయి అంటున్నారు.


జర్నలిస్టుగా తనకు ఎవరిపైనా రాగద్వేషాలు ఉండవని.. విషయాన్నిబట్టి, సంఘటనను బట్టి విశ్లేషించడమే తన పని అంటూ సాయి అంటున్నారు. తాను గతంలో చాలాసార్లు చంద్రబాబును విమర్శించానని.. అలాగే జగన్ ను సైతం విమర్శించానని..కానీ అవేమీ చూడకుండా గుడ్డిగా తనను అమ్ముడుపోయిన జర్నలిస్టు అంటూ ట్రోల్ చేయడం సంస్కారం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అభిమానులు నిజాలు చెప్పే తనలాంటి జర్నలిస్టులను ట్రోల్ చేయడం మాని.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే మంచిదంటూ సాయి సలహా ఇచ్చారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగనని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: