అసెంబ్లీలో చంద్రబాబు కాకుండా మాట్లాడేది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. మిగతా వారు అస్సలు నోరు మెదపటం లేదు. అధికారపక్షం తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల, రామానాయుడు తప్పమిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌లు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు.


వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు. టీడీపీ సమావేశంలో చంద్రబాబు స్వయంగా తమ నేతలను ఉద్దేశించి ఇదే విషయాన్ని మాట్లాడారని సమాచారం. మీరెందుకు నోరు విప్పడంలేదని నేతల్ని ప్రశ్నించారట. కేవలం అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు.


ఉన్నదే 23 మంది ఎమ్మెల్యేలం కదా.. మిగతా నేతలు కూడా నోరు విప్పాలని ఒకింత అసహనం వ్యక్తం చేశారట. రోజుకు ఒకరు చొప్పున మాట్లాడితే బాగుంటుందనే మాట్లాడటం లేదని ఒకరు, మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం అని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా సమాధానం చెప్పారట. బాబు సూచనల పట్ల రాజమండ్రి నుంచి గెలిచిన ఆదిరెడ్డి భవానీ స్పందిస్తూ.. నేను మాట్లాడతా, కానీ అసెంబ్లీకి వచ్చిందే కొత్త కదా.. సీనియర్లని కాదని నేను మాట్లాడితే వారు నొచ్చుకుంటారనే భావనతో ముందుకు రావడం లేదని చెప్పారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: