ప్రతి రాష్ట్రానికి గవర్నర్ తప్పనిసరి.  గత కొంతకాలంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఒక్కరే గవర్నర్ ఉన్నారు.  ఉమ్మడి రాష్ట్రం అధికారంలో ఉండగా నరసింహన్ ను నియమించారు.  రాష్ట్రాలు విడిపోయాక కూడా ఆయన్నే గవర్నర్ గా రెండు రాష్ట్రాలకు నియమించారు.  


కారణాలు చాలా ఉన్నాయి.  విభజన సమయంలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను అలానే ఉంచారని తెలుస్తోంది.  కాగా, ఇప్పుడు మరోమారు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను ఏర్పాటు చేసింది.  


ఈనెల 24 వ తేదీన బిశ్వభూషణ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  విజయవాడలోని పాత సీఎం క్యాంప్ ఆఫీస్ ను గవర్నర్ బంగ్లాగా మార్పులు చేస్తున్నారు.  ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయి.  ఈనెల 23 వ తేదీన బిశ్వభూషణ్ భువనేశ్వర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వస్తారు.  


అదే రోజున తిరుమల వెళ్లి దర్శనం చేసుకుంటారట.  అక్కడి నుంచి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని గవర్నర్ బంగ్లాలో ఉంటారు.  24 వ తేదీన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గవర్నర్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.  రాజ్ భవన్ ను అంగరంగవైభవంగా యుద్దప్రాతి పదికన ముస్తాబు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: