మసక మసక చీకటిలో అంటూ అప్పుడెప్పుడో కుర్రకారును ఉర్రూతలూగించిన విజయవాడ సింగర్ స్మిత పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలైంది.  ఇప్పటికే తన పాప్ సింగింగ్ తో అలరిస్తోంది.  20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  దీనికి టాలీవుడ్ నుంచి అనేకమంది హాజరవుతున్నారు.  


ఇదిలా ఉంటే, ఈ పాప్ సింగర్ కు ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు.  20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆమెను అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారట.  దానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.  ఈ లేఖ నిజంగా తనకు సర్ప్రైజ్ ఇచ్చిందని స్మిత్ తెలిపింది. 


స్మిత ఒక్క తెలుగులోనే కాకుండా దాదాపు 9 భాషల్లో ఆమె పాప్ సాంగ్స్ పాడింది.  మసక మసక చీకటిలో, హాయ్ రబ్బా ఆల్బమ్స్ ఆకట్టుకున్నాయి.  ఇదిలా ఉంటే, స్మిత సినిమా సాంగ్స్ తో పాటు బాహుబలి ప్రచార గీతం కూడా పాడింది.  ఆమె కాకుండా తన కూతురితో కలిసి ఈ సాంగ్ ను పాడటం విశేషం.  


ఒకవైపు సాంగ్స్ పై దృష్టిపెడుతూనే సినిమాల్లో కూడా నటించింది.  మల్లీశ్వరి సినిమాలో నెగటివ్ రోల్ చేసి మెప్పించింది.  మల్లీశ్వరిని చంపేందుకు వచ్చి సైలెంట్ కిల్లర్ మెప్పించింది.  దీంతో పాటు, ఆట సినిమాలో కూడా కీ రోల్ ప్లే చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: