రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే గంటా శ్రీనివాస రావు, 2019 ఎన్నికల తరువాత చాలా సైలెంట్ అయ్యారు.  బయటే కాదు అసెంబ్లీలోను నోరు విప్పడం లేదు.  వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటున్నారు.  మిగతా ఎమ్మెల్యేలు అధికారపక్షం వైకాపాపై విరుచుకుపడుతుంటే.. నాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.  


ఇలా ఆయన సైలెంట్ గా ఉండటం వెనుక కారణం ఏంటి.. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు.  దీనికి వెనుక కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది.  గంటా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, అధికారపక్షంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు.  


కానీ, డోర్స్ క్లోజ్ అయ్యాయి.  ఎవరికి లోపలికి అనుమతి లేదు.  ఒకవేళ రావాలి అంటే పదవికి, పార్టీకి రాజీనామా చేసి రావాలి.  అలా వెళ్లి గెలవాలి అంటే కష్టం.  అందుకే ఇతర పార్టీ నేతలు వైకాపాలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు.  అందుకే అందరి చూపులు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు.  


గంటా కూడా అటువైపు వెళ్తారని ప్రచారం జరుగుతున్నది.  కానీ, ఆయన ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు.  సమయం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.  గంటా విషయంలో బాబు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మొత్తానికి పార్టీలో ఏదో జరుగుతున్నది.  అది ఏంటి అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: