వైకాపా అధికారంలోకి రాకముందు రోజా ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నది.  తన వాయిస్ ను చాలా బలంగా వినిపించింది.  దీంతో పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.  పార్టీ కష్టకాలంలో ఉండగా రోజానే ఆదుకుంది.  వాయిస్ తో పార్టీని నడిపించింది.  పార్టీలో కీలక పాత్ర పోషించిన రోజాకు పదవి వస్తుంది అనుకున్నారు.  


ఆశ్చర్యంగా ఆమెను పక్కన పెట్టడంతో రోజాకే కాదు ఆ పార్టీ కూడా షాక్ అయ్యింది. ఆమెను ఓదార్చేందుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు.  సమీకరణాల కారణంగా ఆమెకు పదవి ఇవ్వలేదని సర్దిచెప్పారు. రెండేళ్ల తరువాత జరిగే మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆమెకు పదవి ఇస్తారని సమాచారం.  


అప్పటికైనా ఇస్తారని గ్యారెంటీ లేదు.  అందుకే ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా రోజా అసెంబ్లీలో సైలెంట్ గా ఉంటోంది.  వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా పార్టీలో ఉండిపోయింది.  రోజా అసెంబ్లీలో సైలెంట్ గా ఉండటం ఎవరికి మింగుడు పడటం లేదు.  


అసెంబ్లీ సమావేశాల్లో అంబటి రాంబాబు ఒక్కరే వాయిస్ ను వినిపిస్తున్నారు.  మరో ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.  అయితే, రోజా సైలెంట్ గా ఉండటం వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది.  సైలెంట్ గా ఉంది సమావేశాలను అవగతం చేసుకోవాలని, తద్వారా ఫ్యూచర్ లో మంత్రి అయ్యాక ఎలా ఉండాలో నేర్చుకుంటోందని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: