బీజేపీ అగ్రనాయకత్వానికి  జగన్ అంటే రోజురోజుకి పడని పరిస్థితి కనబడుతుంది.  ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులను  గమనిస్తే...   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ  వైసీపీని దెబ్బ కొట్టే ఆలోచన చేస్తోందని అర్ధమవుతుంది.  అందుకే ఈ మధ్య బీజేపీ లోకల్ నాయకులు కూడా  జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా  విమర్శిస్తున్నారు.  దాంతో వైసీపీ కూడా  బీజేపీ నాయకుల పై ఎదురుదాడికి  దిగుతుంది.  మొత్తానికీ రోజులు కరుగుతున్న కొద్దీ   రెండు పార్టీల మధ్య  విభేదాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ విభేదాలు పుట్టాడనికి ముఖ్యకారణం జగనేనట.   జగన్  వ్యవహార శైలికి  మోదీ సైతం  విసిగిపోయారట. క్రైస్తవ మతానికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం, ప్రత్యేక హోదా విషయంలో జగన్ అత్యుత్సాహాం  మోదీకి అస్సలు రుచించడం లేదని తెలుస్తోంది. 

అలాగే జగన్ విషయానికి వస్తే.. ఏపీలో  టీడీపీ పార్టీ నేతలను చేర్చుకోని  బీజేపీ బలం పెంచుకకునే ప్రయత్నాలు చేయడం,  బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ని  ఏపీకి గవర్నర్ గా నియమించడం,   దానికి తోడు వైసీపీ కి చెందిన నేతలను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు పన్నుతుండటం కూడా  జగన్ కి   వైసీపీ నాయకులకి  తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.  పైగా  ఏపీలో బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందని, బీజేపీ నాయాకులు  బహిరంగంగానే ప్రకటించడం కూడా  వైసీపీని ఆలోచనలో పడేసింది. ఇలాంటి అనేక కారణాల వల్ల మోదీకి జగన్ శత్రువుగా మారుతున్నాడట.  



మరింత సమాచారం తెలుసుకోండి: