' ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి ఉదాత్త లక్ష్యాలు ఉండవచ్చు. అయితే ముఖ్యమంత్రిని లక్ష్యాల తీరాలకు చేర్చవలసింది అధికార యంత్రాంగమే! అధికారులు వెలిబుచ్చే అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోకుండా ముఖ్యమంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తే అధికార వ్యవస్థ గాడి తప్పుతుంది...........'

ఇంకా రెండు నెలల పాలన కూడా పూర్తి చేయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ పై ఒక ప్రముఖ పత్రిక విశ్లేషణ ఇది.
'ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన కొత్తలో పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగే వారికి నెలకు 18 వేల జీతం ఇస్తానని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కల్పించుకుని.. ''అయ్యో సార్‌! గంట పనికి అంత జీతం ఇవ్వలేం'' అని వారించే ప్రయత్నం చేయగా.....

''నెలకు లక్ష రూపాయలు ఇస్తే మాత్రం మీరు, నేను ఆ పని చేస్తామా?'' అని జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు....' అని ఆ పత్రిక కథనం. సామాజిక కోణంలో ఆలోచిస్తే, ఎల్వీని జగన్‌ ప్రశ్నంచడంలో, ఈ దేశంలోని ఏ రాజకీయనాయకుడిలోని కనిపించని మానవీయ కోణం ఉంది.

' ఎంతో ఆధునిక ప్రగతి సాధించామని చెప్పుకుంటున్న ఈ సమాజంలో ఇప్పటికీ మరుగుదొడ్లను మానవులే క్లీన్‌ చేయడం ,ఆ వృత్తిలో ఉన్న వారికి కనీస వేతనాలు ఇవ్వక చిన్న చూపు చూడటం అన్యాయం, అమానవీయం..' అంటున్నారు , వెంకటేశ్‌ అనే సామాజిక వేత్త. ఆయన పారిశుధ్యం పై అనేక రచనలు చేశారు.
స్కూల్‌ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే,టాయిలెట్లు శుభ్రంగా ఉండాలి.వాటిని నిత్యం శుభ్రం చేసే సపాయి కార్మికులకు అధిక వేతనాలు ఇవ్వడం అంటే వారిని గౌరవించడమే.

ఈ ఆదర్శం వినడానికి బాగుంటుందే గానీ ఆచరణలోకి వచ్చేసరికి నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంటే, రూ.18 వేలు కాక పోతే, కనీసం 15 వేలైనా ఇవ్వవచ్చు. కానీ జగన్‌ మాట తప్పకూడదు. రాష్ట్రం లోపలే, ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరగడం ఆపి, ఖర్చులు తగ్గించుకుంటే , ఆయన చెప్పిన హామీలు నెరవేర్చవచ్చు.
'' ఎల్వీగారూ, ఆ దిశగా సీఎం గారికి సలహాలిచ్చి , ఆయన ఆశయాలు నెరవేరేలా చేయండి ...''


మరింత సమాచారం తెలుసుకోండి: