వరల్డ్ బ్యాంక్ అప్పులిచ్చే అతి పెద్ద ప్రపంచ రుణ దాత. అప్పు పుచ్చుకున్న వాడు ఉత్తముడు అన్న సూత్రాన్ని బాగా వంట బట్టించుకున్న భారత్, అందులోని రాష్ట్రాలకు ఈ పెద్దన్న రుణ దాత ఆపధ్భాంధవుడే. అప్పు పుచ్చుకో అనడం వరకే నీతి.  తీర్చడం అన్నది ఎవరికి వారికి తోచిన రీతి. అది రాష్ట్రమైనా, దేశమైనా అంతే.


ఇదిలా ఉండగా రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ  ఏపీలో ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా  సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించిందని ప్రచారం సాగుతోంది. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి.


అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 


అంటే ఇక్కడ విషయం క్లియర్. బాబు కలల రాజధాని, భ్రమరావతి, అదే అమరావతికి మాత్రం రుణం ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ కి ససేమిరా ఇష్టం లేదన్న మాట. మరి రాజధాని ప్రతిపాదనలు అంత గొప్పగా నా టి ప్రభువులు చేశారన్నదేగా అర్ధమవుతున్న విషయం.  దాంతో  అలా షాక్ కొట్టేసిందన్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: